Sunday, February 6, 2011

Va Quarter Cutting

అమ్మ కూతుర్ని కొడుతూ : నీకు అసలు బ్రెయిన్ లేదే
కూతురు : నాకు ఒళ్ళంతా బ్రెయిన్
అమ్మ : ఒళ్ళంతా ఉంటె అది బ్రెయిన్ కాదె కొవ్వు

విలన్ : నేను నీ చెయ్యి నరికేస్తా
హీరో : వద్దురా నేను సౌది అరబియా వెళ్తున్న అక్కడ అమ్మాయిలని చూడకూడదు అంట , చేయితో చాలా పని ఉంది

హీరో: ఇక్కడ ఎందుకు పడుకున్న
హీరోయిన్: వెయిటింగ్ .. ఏదో ఒక కారో , లారియో వస్తే చచ్చిపోద్దాం అని
హీరో : ఇక్కడ ట్రాఫ్ఫిక్ తక్కువ రా మెయిన్ రోడ్ లో వదిలి పెడతా
హీరోయిన్: నాకు ఏమి తొందరలేదు ఇక్కడే వెయిట్ చేస్తాలే


సెకండ్ హీరో : నువ్వు అసలు భోజనం చేశావా
హీరోయిన్: లేదు
సెకండ్ హీరో : భోజనం చెయ్యి ఆత్మ హత్య చేసుకోవాలి అనే ఆలోచన పోతుంది
హీరో : భోజనం చేస్తే ఆత్మ హత్య చేసుకోవాలని కోరిక పోతుందా? ఈయనని బార్డర్ కి పంపిస్తే పాకిస్తాన్ వాళ్ళకి బిర్యాని తినిపించే యుద్ధం గెలిచేస్తాడు

ఎమ్. ఎల్. ఏ పోటి చేసే వ్యక్తి అందరికి బిర్యాని మందు పంచుతు ఉంటాడు
సెకండ్ హీరో : సార్ వెజిటేరియన్ లేదా సార్
ఎమ్. ఎల్. ఏ పోటి చేసే వ్యక్తి : వెజిటేరియన్ పెట్టడానికి నేను ఏమి అయిన బ్రాహ్మణా హోటల్ నడుపుతున్నాన


హీరో ఒక రాజకీయ నాయకుడుతో : ఈ టైములో మీరు ఏమి చేస్తున్నారు సార్
రాజకీయ నాయకుడు: రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. నిద్రపోతున్న కాలు ఊపుతూ ఉండాలి లేకపోతే శవం అని పాతిపెట్టేస్తారు

ఒక వ్యక్తి సెకండ్ హీరో స్కూటర్ తగల పెడతాడు , సెకండ్ హీరో వాడితో పాటు జైలులో ఉండాల్సి వస్తుంది
సెకండ్ హీరో: తమాషాగా సరదా కోసం నన్ను తగలపెట్టి వేడుక చూడవు కదా
ఆ వ్యక్తి : లేదులే అలా మనుషులని తగలపెట్టడం మా ఫ్రెండ్ హాబి, నాది కాదు



హీరో , సెకండ్ హీరో విలన్ డెన్ దగ్గరకి వస్తారు

సెకండ్ హీరో: లోపాలకి వెళ్లి కుడి వైపు తిరిగితే మెట్లు ఉంటాయి . ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తే మార్ - తీన్ మార్ అని ఇద్దరు ఉంటారు . వాళ్ళని ప్రిన్స్ ఎక్కడ అని అడుగు
ప్రిన్స్ కనిపించగానే మందు అడుగు . ఇవ్వను అంటే , అర్జెంట్ గా బాత్రూం వస్తుంది వెళ్ళాలి అని చెప్పి వచ్చే
హీరో : బాత్రూం వస్తుంది అనే చెప్పాలా , లేక కిందకి వేల్లేసి వస్తా , కిల్లి వేసుకు వస్తా అని ఏమి అయిన చెప్పచా

లోపాలకి వెళ్ళిన హీరో ముందు ఇద్దరు నిలబడి ఉంటారు
హీరో : ఎవరు మీరు
మార్ : నేను మార్. వంద మందిని చంపాను అందుకే నా పేరు మార్
హీరో : ఉండు నువ్వు మూడు వందల మందిని చంపావు అందుకే తీన్ మార్
తీన్ మార్: కాదు వాడు చంపినా ప్రతిసారి ఆ బాడి ముందు నేను తీన్ మార్ డాన్సు వేస్తా


హీరోయిన్ కెవ్ అని గెట్టిగా అరుస్తుంది
ఇద్దరు కారులో పారిపోతుంటారు
హీరో: ఒరేయ్ మీకు ఎంత దైర్యంరా ఒంటరిగా ఉన్న అమ్మాయిని గ్రేప్ (గ్రూప్ రేప్) చేయాలి అని ప్రయత్నిస్తారా
చేసింగ్ ...
హీరో హీరోయిన్ చూపిస్తూ :చూడు దీని వల్ల అని ప్రాబ్లంస్
హీరోయిన్: అయ్యో .. ! వాళ్ళు వచ్చింది నాకోసం కాదు నీ కోసమే
హీరో : నా కోసం వచ్చారా .. అది రేప్ చేయడానికి . ఎవరు వాడు
హీరోయిన్ : ఏదో పేరు చెప్పరే . రంపం, పారా , గడపార , కొడవలి .... మార్ - తీన్ మార్

ప్రారంభం

నాకు సినిమాలు అంటే పిచ్చి అని చెప్పే వాళ్ళని చాలా మందిని చూసి ఉంటారు .
కాని రోజుకి కనీసం ఒక సినిమా చూసే వారిని ఎంత మందిని చూసి ఉంటారు .
చూసి అక్కడితో గమ్ముగా ఉండకుండా ఆ సినిమా గురించి డిస్కషన్ మొదలు పెట్టె వాళ్ళని చూసి ఉంటారు.
నేను ఈ కోవకి చెందినా వాడ్ని.
నాకు తెలిసినంతవరకూ జనాలు కధ బాగా ఉంది , ఫైట్స్ బాగా ఉన్నాయి అంటారు.
కాని సినిమాకి వెన్నుముక సంభాషణలు (డైలాగ్స్ ).


ఉదాహరణకి :
మనిషికి దేవుడు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా . ఒకటి తన కోసం మరొకటి పక్కవాడికి సాయం చేయడం కోసం . (గణేష్ పాత్రో - రుద్రవీణ )
యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు శత్రువుని ఓడించటం (త్రివిక్రమ్ శ్రీనివాస్ - జల్సా)
కొన్ని కామెడీ డైలాగ్స్
వాష్ బ్యాసిన్ లో చేపలు పట్టుకునే వాడిలా ఆ మొహం చూడు (జంధ్యాల - అహా నా పెళ్ళంట )
కులాసా ,,, ఆ .. కులాసే కుమారుడి వాళ్ళ లాసు (జంధ్యాల -పడమటి సంధ్య రాగం )

ఎమ్.ఎస్ : ఎలాగైనా మా అమ్మ బొమ్మ గీసి నా జన్మ చరితార్థం చెయ్యి బాబు
వెంకటేష్: అంకుల్ కొంచెం తెలుగులో చెప్తారా (త్రివిక్రమ్ శ్రీనివాస్ -నువ్వు నాకు నచ్చావ్ )

భయపడకండి ఇలా మీకు తెలిసిన డైలాగ్స్ కాకుండా వేరే బాష చిత్రాల డైలాగ్స్ మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తా.