Sunday, February 6, 2011

ప్రారంభం

నాకు సినిమాలు అంటే పిచ్చి అని చెప్పే వాళ్ళని చాలా మందిని చూసి ఉంటారు .
కాని రోజుకి కనీసం ఒక సినిమా చూసే వారిని ఎంత మందిని చూసి ఉంటారు .
చూసి అక్కడితో గమ్ముగా ఉండకుండా ఆ సినిమా గురించి డిస్కషన్ మొదలు పెట్టె వాళ్ళని చూసి ఉంటారు.
నేను ఈ కోవకి చెందినా వాడ్ని.
నాకు తెలిసినంతవరకూ జనాలు కధ బాగా ఉంది , ఫైట్స్ బాగా ఉన్నాయి అంటారు.
కాని సినిమాకి వెన్నుముక సంభాషణలు (డైలాగ్స్ ).


ఉదాహరణకి :
మనిషికి దేవుడు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా . ఒకటి తన కోసం మరొకటి పక్కవాడికి సాయం చేయడం కోసం . (గణేష్ పాత్రో - రుద్రవీణ )
యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు శత్రువుని ఓడించటం (త్రివిక్రమ్ శ్రీనివాస్ - జల్సా)
కొన్ని కామెడీ డైలాగ్స్
వాష్ బ్యాసిన్ లో చేపలు పట్టుకునే వాడిలా ఆ మొహం చూడు (జంధ్యాల - అహా నా పెళ్ళంట )
కులాసా ,,, ఆ .. కులాసే కుమారుడి వాళ్ళ లాసు (జంధ్యాల -పడమటి సంధ్య రాగం )

ఎమ్.ఎస్ : ఎలాగైనా మా అమ్మ బొమ్మ గీసి నా జన్మ చరితార్థం చెయ్యి బాబు
వెంకటేష్: అంకుల్ కొంచెం తెలుగులో చెప్తారా (త్రివిక్రమ్ శ్రీనివాస్ -నువ్వు నాకు నచ్చావ్ )

భయపడకండి ఇలా మీకు తెలిసిన డైలాగ్స్ కాకుండా వేరే బాష చిత్రాల డైలాగ్స్ మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తా.

1 comment: